ఖమ్మం, వెలుగు: రంజాన్ సందర్భంగా ఈద్గాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని ఖమ్మం సీపీ సునీల్ దత్ తెలిపారు. గురువారం ముస్లిం సోదరుల సామూహికప్రార్థనల దృష్ట్యా బుధవారం నగరంలోని గొళ్లగూడెం ఈద్గా ప్రాంతాన్ని సీపీ సందర్శించారు. ట్రాఫిక్, పార్కింగ్, భద్రతపై నిర్వాహకులతో పాటు అధికారులతో చర్చించారు. ప్రార్థన కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు పడకుండా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఆయన వెంట లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు, టౌన్ ఏసీపీ రమణమూర్తి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు ఉన్నారు.
ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డులకు సన్మానం
ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డులు సీహెచ్. తిరుమలరాజు, ఎన్. నాగయ్య ను కమిషనరేట్లో సీపీ సన్మానించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలలో బాధ్యతయుతమైన విధులు నిర్వహించి పోలీస్ అధికారుల మన్ననలు పొందారని వారిని అభినందించారు.