కేటీఆర్‌‌‌‌‌‌‌‌..ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు మానుకో : పువ్వాళ్ల దుర్గాప్రసాద్ 

కేటీఆర్‌‌‌‌‌‌‌‌..ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు మానుకో : పువ్వాళ్ల దుర్గాప్రసాద్ 
  • డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ 

ఖమ్మం టౌన్,వెలుగు : బీఆర్ఎస్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ కేటీఆర్‌‌‌‌‌‌‌‌ మతిభ్రమించిందని, ఇప్పటికైనా ఆయన ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు మానుకోవాలని ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ హితవు పలికారు. గురువారం పార్టీ జిల్లా ఆఫీస్‌‌‌‌లో మీడియాతో మాట్లాడుతూ 10 ఏండ్ల బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​ పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటపడేయడానికి సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి, డిప్యూటీ భట్టి విక్రమార్క అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారంటీలను అమలుచేస్తున్నా..  

కేటీఆర్‌‌‌‌‌‌‌‌ మీకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 10 నెలల కాంగ్రెస్‌‌‌‌ పాలనలో 11వేల టీచర్లు భర్తీ చేశామన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీలు పోట్ల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ, నలమల వెంకటేశ్వరరావు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, లీడర్లు సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, బొందయ్య, అబ్దుల్ రషీద్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.