ఖమ్మం డీసీసీబీ సీఈవో సస్పెన్షన్

ఖమ్మం డీసీసీబీ సీఈవో సస్పెన్షన్

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం డీసీసీబీ సీఈవో అబీద్ ఉర్ రహమాన్‎ను సస్పెండ్ చేస్తూ మంగళవారం రాష్ట్ర డైరెక్టర్ అండ్ రిజిస్ట్రార్  పి.ఉదయ్ కుమార్  ఉత్తర్వులు జారీ చేశారు. రైతుల క్రాప్ లోన్లు, రుణాల మళ్లింపు, అక్రమ బదిలీలపై సీఈవో పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విచారణ జరిపించాలని ఆదేశించారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో వేటు వేశారు.