ఏం అభివృద్ధి చేశావో చూపించు.. రేగా కాంతారావుకు నిరసన సెగ

తెలంగాణలోని గ్రామాల్లో తిరిగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చేదు అనుభవం ఎదురవుతోంది.  గ్రామాల్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారు. తాజాగా ప్రభుత్వ విప్ , పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు అంజనాపురం గ్రామస్తుల నుంచి నిరసన సెగ తగిలింది. 

ALSO READ :ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మాకొద్దు.. ఇల్లందులో బీఆర్ఎస్ అసమ్మతి నేతల డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  బూర్గంపాడు మండలం అంజనాపురం గ్రామంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు పర్యటించారు.  సీసీ రోడ్ల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయన్ను   గ్రామస్తులు నిలదీశారు. తమ గ్రామాన్ని ఏం అభివృద్ధి చేశావు చూపించూ అంటూ ప్రశ్నించారు. ప్రజలు నిలదీయడంతో రేగా కాంతారావు చెప్పకుండా వెళ్లిపోయారు.