- ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, నోడల్ ఆఫీసర్ రఘునందన్‌రావు
కూసుమంచి/పాల్వంచ/చండ్రుగొండ, వెలుగు: దరఖాస్తుదారులను ఇబ్బంది పెట్టొద్దని, ఆధార్ఆంధ్రా అడ్రస్‌తో ఉన్నా అప్లికేషన్లు తీసుకోవాలని ఖమ్మం జిల్లా నోడల్ ఆఫీసర్ యం.రఘునందన్ రావు, కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. శుక్రవారం కూసుమంచి మండలం గైగోళ్లపల్లి రైతువేదికలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించారు. అధికారులకు, దరఖాస్తుదారులకు పలు సూచనలు చేశారు. కొత్తగా రేషన్‌కార్డుకు అప్లయ్చేసుకోవచ్చని చెప్పారు.
కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్ మధుసూధన్‌నాయక్, డీఆర్డీఏ పీడీ విద్యాచందన, డీఎస్ఓ, పాలేరు నోడల్ ఆఫీసర్ గంటా శ్రీలత, పాలేరు స్పెషల్ ఆఫీసర్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. పాల్వంచ గాంధీ నగర్ లో శుక్రవారం నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొని అప్లికేషన్లు తీసుకున్నారు. ప్రతి ఇంటికి అప్లికేషన్లు చేరేలా ప్లాన్‌చేయాలని అధికారులకు సూచించారు.
మున్సిపల్ కమిషనర్ అజ్మీర స్వామి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, మున్సిపల్ డీఈ మురళి, ఏఈ రాజేశ్ పాల్గొన్నారు. ప్రజాపాలన దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రశీదు అడిగి తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ కలెక్టర్ రాంబాబు సూచించారు. శుక్రవారం పోకలగూడెం, రావికంపాడు, మద్దుకూరు గ్రామాల్లోని ప్రజాపాలన కౌంటర్లను పరిశీలించారు. సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు. ఆయన వెంట తహసీల్దారు సాజియా సుల్తానా, ఎంపీడీఓ రేవతి ఉన్నారు.