
- ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్
ఖమ్మం టౌన్, వెలుగు : శ్రద్ధగా చదివి సమాజంలో గొప్ప స్థాయికి ఎదిగి, మరో నలుగురి ఎదుగుదలకు తోడ్పాటు అందించాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలు అందించేందుకు మలబార్ గోల్డ్చారిటబుల్ సంస్థ గురువారం స్థానిక శాంతినగర్ ఏఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 47 మందికి ప్రోత్సాహకంగా రూ.3.80 లక్షల చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అందుబాటులో ఉన్న విద్యను వినియోగించుకుంటే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు. విద్యార్థులకు సాయం చేస్తున్న మలబార్ గోల్డ్ సంస్థ ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు, కళాశాల ప్రిన్సిపాల్ గోవిందరావు, అధ్యాపకులు పవన్, భరత్ కుమార్, రాణి, శ్రీనివాస్, కిరణ్, మలబార్ సంస్థ జిల్లా హెడ్ విష్ణు, మేనేజర్ రామారావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.