ఖమ్మం జిల్లా ఆస్పత్రికి బీఎఫ్‌‌‌‌హెచ్‌‌‌‌ఐ గుర్తింపు

ఖమ్మం జిల్లా ఆస్పత్రికి బీఎఫ్‌‌‌‌హెచ్‌‌‌‌ఐ గుర్తింపు
వైద్య సిబ్బందికి మంత్రి హరీశ్‌‌‌‌రావు అభినందనలు

హైదరాబాద్, వెలుగు : ఖమ్మం జిల్లా ఆస్పత్రికి ‘బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ హాస్పిటల్ (బీఎఫ్‌‌‌‌హెచ్‌‌‌‌ఐ)’గా గుర్తింపు దక్కింది. రాష్ట్రంలో బీఎఫ్‌‌‌‌హెచ్‌‌‌‌ఐ సర్టిఫికెట్ పొందిన ఆరో హాస్పిటల్‌‌‌‌గా నిలిచింది. ఇప్పటికే బాన్సువాడ, జనగామ, గజ్వేల్, సూర్యాపేట, జహీరాబా ద్ ఆస్పత్రులకు ఈ గుర్తింపు లభించిం ది.

రాష్ట్రంలోని 6 హాస్పిటల్స్‌‌‌‌ ఈ ఘనత సాధించడం గొప్ప విషయమంటూ వైద్య సిబ్బందికి మంత్రి హరీశ్ అభినందనలు తెలిపారు. మరో 9 దవాఖాన్లు బీఎఫ్‌‌‌‌హెచ్‌‌‌‌ఐ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాయని, త్వరలోనే గుర్తింపు లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.