
కూసుమంచి, వెలుగు : బీఆర్ఎస్లీడర్ల బెదిరింపులకు భయపడేది లేదని, కవ్వింపు చర్యలకు పాల్పడితే తిరగబడి తరిమి కొట్టేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఖమ్మం జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మద్దినేని స్వర్ణకుమారి చెప్పారు. గురువారం కూసుమంచి మండల కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. కూసుమంచి సర్పంచ్చెన్నా మోహన్‌రావు అమ్ముడుపోయి, పార్టీ మారారని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం కరెక్ట్‌కాదన్నారు. తాము ఎవరినీ భయపెట్టడం లేదని, స్వచ్ఛందంగా వచ్చి కాంగ్రెస్‌లో చేరుతున్నారని చెప్పారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పదికి పది సీట్లతోపాటు, రాష్ట్ర వ్యాప్తంగా మెజారీ సీట్లు కాంగ్రెస్గెలవబోతుందని చెప్పారు. ఈ సందర్భంగా నాయకన్‌గూడెం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్‌లో చేరారు. అలాగే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కొడుకు హర్షారెడ్డి గురువారం కూసుమంచి మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. శ్రీనివాస్‌రెడ్డికి ఓటు వేయాలని ప్రచారం చేశారు.