ఒకటి కొంటే మరొకటి ఫ్రీ.. ఆ వస్తువు కొంటే ఈ వస్తువు ఫ్రీ.. ఇలా ప్రస్తుతం ఫ్రీల రాజ్యం నడుస్తుంది. ఇప్పుడది కాస్త బస్సుల్లో మహిళలకు ఉచితం అనేదాకా వచ్చింది. కాని కొంతమంది మహిళలు మాకు బస్ ఫ్రీ వద్దు .. తాము టికెట్ కొనే బస్సుల్లో ప్రయాణిస్తామని ఓ పల్లెటూరి మహిళా టీచర్లు నిర్ణయం తీసుకున్నారు.
మహిళా సాధికారతకు ఖమ్మం జిల్లాలోని కొందరు ఆదర్శ మహిళా ఉపాధ్యా యులు సరైన నిర్వచనం పలికారు. ఫ్రీ గా దొరికితే చాలు ఏదైనా సరే వాడేద్దాం అనే చోటనే స్వచ్ఛందంగా ఫ్రీ బస్సు టికెట్ సర్వీసును వాడుకోకుండా, ఈ అవకా శాన్ని పేదలకే వదిలేసి తాము టికెట్ తీసుకుని ప్రయాణించాలని నిర్ణయిం చారు..ఈ ఆదర్శ ఉపాధ్యాయులు.
ఖమ్మం రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపా ధ్యాయులు శనివారం ( డిసెంబర్ 16) కాంప్లెక్స్ మీటింగ్ లో ఉపాధ్యా యులందరూ,కలిసి ఫ్రీ బస్సు, ఫ్రీ టికెట్ మనం వాడుకోవద్దని డిసైడ్ అయ్యారు.
ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సౌకర్యాన్ని వృద్ధులకు, కాలేజీ పిల్లలకు ఒదిలే ద్దామని నిర్ణయించారు. తద్వారా టీ ఎస్ ఆర్టీసీ భవిష్యత్తు కోసం ఇంకా పలువురు ఆటో కార్మికులకు ఉపాధినిస్తూ వారి కుటుం బాలకు సాయంగా ఉందామని, ప్రతిజ్ఞ చేశారు. మహిళా ఉపాధ్యాయుల నిర్ణయం ప్రశంసనీయమని పలువురు కొనియాడారు.