జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్ష కేంద్రాల ఏర్పాట : ఆర్ పార్వతీ రెడ్డి

జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్ష కేంద్రాల ఏర్పాట : ఆర్ పార్వతీ రెడ్డి
  • ఖమ్మం జిల్లా కో-ఆర్డినేటర్ ఆర్ పార్వతీ రెడ్డి

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : దేశవ్యాప్తంగా ఎన్టీఏ వారు నిర్వహించే జేఈఈ మెయిన్స్, బీఆర్క్ రెండో విడత 2025 పరీక్షలకు గాను ఖమ్మం జిల్లాలో పరీక్ష కేంద్రాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కో--ఆర్డినేటర్ ఆర్ పార్వతి రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష కేంద్రాలను బొమ్మ, శ్రీచైతన్య, ఎస్బీఐటీ, విజయ ఇంజినీరింగ్ కళాశాల్లో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 2, 3, 4 , 7, 8, 9 తేదీల్లో జరిగే ఈ పరీక్షలకు 3,095 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. 7, 8, 9 తేదీల్లో నిర్వహించే విద్యార్థుల సంఖ్యను 5వ తారీఖులోపు ఎన్డీఏ వారు తెలియజేస్తారని పేర్కొన్నారు. 

జేఈఈ మెయిన్స్, బీఆర్క్ పరీక్షలను రెండు షిఫ్టులుగా నిర్వహించనుండగా మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. ఉదయం 8:30 గంటల నుంచి  మధ్యాహ్నం 2:30 గంటలకు పరీక్ష కేంద్రం గేట్లు మూసివేస్తారని, కేంద్రానికి ఒక గంట ముందుగానే చేరుకోవాలని పేర్కొన్నారు. పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు ఎన్టీఏ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు.