ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హర్యాతండా మే 28న జరిగిన కారు యాక్సిడెంట్ వెనుక ఉన్న కుట్రను పోలీసులు చేదించారు. ఖమ్మం ఏసిపి రమణ మూర్తి ప్రెస్ మీట్ లో కేసులో విషయాలు తెలిపారు. ఇద్దరు పిల్లలు కృషిక(5), క్రితన్య(2)తో సహా భార్య కుమారి(25) లు మృతి చెందిన కేసులో పోలీసులు నిజాలు బయటపెట్టారు. కుమారి(25)భర్త బోడ ప్రవీణ్ నాయక్ విషం ఇచ్చి వారిన చంపి ఆక్సిడెంట్ గా చిత్రీకరించాడు. భార్యతో సహా పిల్లలను చంపి గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేసేందుకు ఇంటికి తీసుకొచ్చే క్రమంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని, దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్టు మృతురాలి బంధువులు ఆరోపించి, ఆందోళన చేపట్టారు.
ప్రవీణ్ మగ సంతానం కోసం కేరళకు చెందిన నర్సుతో సహజీవనం చేస్తున్నాడు. పెద్దలు పంచాయితీ నిర్వహించి వీరి మృతికి 20 రోజుల క్రితమే కుమారి, ప్రవీణ్ లను కలిపారు. బొడా ప్రవీణ్ హైదరాబాద్ ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అక్కడ కేరళకు చెందిన ఓ నర్సుతో విహహేతర సంబంధం పెట్టుకున్నాడు. భార్య, పిల్లలను అడ్డు తెలగించుకుందామని అనస్థీషియా ఓవర్ డోస్ ఇచ్చి వారిని హత్య చేశాడు.. ప్రవీణ్. ఆపై మృతదేహాలను తరలిస్తుండగా కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. అదే అదునుగా వారి చావుకు యాక్సిడెంటే కారణమని చిత్రీకరించాడు. పోలీసులు విచారణ, పోస్టుమార్టంలో అసలు విషయాలు బయటకు వచ్చాయి.