ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: గురుకులాల్లో కార్పొరేట్​ స్థాయి విద్యను అందిస్తున్నట్టు ప్రభుత్వ విప్​ రేగా కాంతారావు తెలిపారు. పాల్వంచ మండలం కిన్నెరసాని స్పోర్ట్స్​ స్కూల్​లో సోమవారం రాష్ట్ర స్థాయి ఇంటర్​ సొసైటీ  లీడ్​ క్రీడా పోటీలను ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్య, రాష్ట్ర గురుకులాల కార్యదర్శి రోనాల్డ్​ రాస్​, కలెక్టర్​ అనుదీప్, ఐటీడీఏ పీఓ గౌతమ్​పోట్రులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు కార్పొరేట్​ స్థాయిలో సౌకర్యాలను 
కల్పించామని తెలిపారు. క్రీడలకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. 

సమస్యలపై కలెక్టరేట్​ ఎదుట ఆందోళనలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్ తో సోమవారం కొత్తగూడెం కలెక్టరేట్​ ఎదుట వివిధ సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు చేశారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ దివ్యాంగులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వీజేఏసీ రాష్ట్ర చైర్మన్​ గుండపనేని సతీశ్​ మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగుల శాఖను స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో విలీనం చేయడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. అనంతరం అడిషనల్​ కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు. కాటి నాగేశ్వరరావు, పద్మ, ఖాదర్​బాబు, నూరి, సునీత, అజారుద్దీన్, శ్రీను, రాజేశ్, సక్కుబాయి, మల్లేశం, రమాదేవి పాల్గొన్నారు. తాము సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలివ్వాలని కోరుతూ ములకలపల్లి మండలం పిల్లవాగు ప్రాంతానికి చెందిన ఆదివాసీలు కలెక్టరేట్​ ఎదుట ఆందోళన చేపట్టారు. పోడు భూములపై సర్వే చేయాలని చండ్రుగొండ మండలం పోకలగూడెం గ్రామానికి చెందిన నాయక్​పోడ్​ గిరిజనులు ధర్నా చేశారు. లక్ష్మీదేవిపల్లి మండలం లోతువాగు గ్రామానికి చెందిన పేదల భూములను ఆక్రమించుకుంటున్న అధికార పార్టీ నాయకుడిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని ప్రజాపంథా నాయకులు జాటోత్​ కృష్ణ, సతీశ్  బాధితులతో కలిసి కలెక్టరేట్​ ఎదుట ధర్నా నిర్వహించారు. బీసీ జాబితాలో చేర్చాలంటూ తెలంగాణ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్​ ఎదుట నిరసన తెలిపారు. వడ్డెర కార్పొరేషన్​ను ఏర్పాటు చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి ఐలమల్లు డిమాండ్​ చేశారు. భద్రాద్రి థర్మల్​ పవర్​ స్టేషన్​ నిర్మాణ కార్మికులకు ప్లాంట్​లో శాశ్వత ఉపాధి కల్పించాలని కోరుతూ వర్కర్లు కలెక్టరేట్​ ఎదుట ధర్నా నిర్వహించారు. 

ఎన్టీఆర్​ ఇచ్చిన అవకాశాలతోనే.. ఇన్నాళ్లు రాజకీయాల్లో నిలబడ్డా

నేలకొండపల్లి, వెలుగు: ఎన్టీఆర్​ ఇచ్చిన అవకాశాల వల్లే తాను ఇన్నాళ్లు రాజకీయాల్లో నిలదొక్కుకోగలిగానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. సోమవారం టీడీపీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా మండ్రాజుపల్లి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కొత్తూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్  తనకు ఇచ్చిన అవకాశాలను గుర్తు చేసుకున్నారు. గోదావరి నీళ్లు పాలేరుకు తేవడమే తన ఆకాంక్షగా పేర్కొన్నారు. ఆకేరు, పాలేరు, మున్నేరులో నీళ్లు నిండా ఉన్నా పాలేరు నియోజక వర్గంలోని ఖమ్మం రూరల్, కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాలు మెట్ట ప్రాంతాలుగా ఉన్నాయని అందుకే భక్తరామదాసు ప్రాజెక్టు తీసుకొచ్చామని తెలిపారు. ఇదిలాఉంటే తుమ్మల ఏ పార్టీ నుంచి పోటీ చేసినా తమ మద్ధతు ఇస్తామని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు తీర్మానం చేసినట్లు తెలిపారు. అనంతరం తుమ్మలను ఘనంగా సన్మానించారు. టీడీపీ మండల అద్యక్షుడు ఆరెకట్ల కొండలరావు, ప్రదాన కార్యదర్శి నల్లమాసు మల్లయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సూరపనేని రామకృష్ణ, మాజీ ఎంపీపీ తీగ వెంకటేశ్వర్లు, కె ఆనందరావు, తలసీల గోపాలరావు, మన్నె నగేశ్, మస్తాన్ , రైతు సమన్వయ కమిటీ జిల్లా అద్యక్షుడు నల్లమల్ల వెంకటేశ్వరావు, టీఆర్ఎస్​ నాయకులు సాదు రమేశ్​రెడ్డి, బండి జగదీశ్, జి రవి, శాఖమూరి రమేశ్, యోనికె జానకి రామయ్య, వెన్నపూసల సీతారాములు పాల్గొన్నారు. 

సమస్యలపై కలెక్టరేట్​ ఎదుట ఆందోళనలు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్ తో సోమవారం కొత్తగూడెం కలెక్టరేట్​ ఎదుట వివిధ సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు చేశారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ దివ్యాంగులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వీజేఏసీ రాష్ట్ర చైర్మన్​ గుండపనేని సతీశ్​ మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగుల శాఖను స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో విలీనం చేయడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. అనంతరం అడిషనల్​ కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు. కాటి నాగేశ్వరరావు, పద్మ, ఖాదర్​బాబు, నూరి, సునీత, అజారుద్దీన్, శ్రీను, రాజేశ్, సక్కుబాయి, మల్లేశం, రమాదేవి పాల్గొన్నారు. తాము సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలివ్వాలని కోరుతూ ములకలపల్లి మండలం పిల్లవాగు ప్రాంతానికి చెందిన ఆదివాసీలు కలెక్టరేట్​ ఎదుట ఆందోళన చేపట్టారు. పోడు భూములపై సర్వే చేయాలని చండ్రుగొండ మండలం పోకలగూడెం గ్రామానికి చెందిన నాయక్​పోడ్​ గిరిజనులు ధర్నా చేశారు. లక్ష్మీదేవిపల్లి మండలం లోతువాగు గ్రామానికి చెందిన పేదల భూములను ఆక్రమించుకుంటున్న అధికార పార్టీ నాయకుడిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని ప్రజాపంథా నాయకులు జాటోత్​ కృష్ణ, సతీశ్  బాధితులతో కలిసి కలెక్టరేట్​ ఎదుట ధర్నా నిర్వహించారు. బీసీ జాబితాలో చేర్చాలంటూ తెలంగాణ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్​ ఎదుట నిరసన తెలిపారు. వడ్డెర కార్పొరేషన్​ను ఏర్పాటు చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి ఐలమల్లు డిమాండ్​ చేశారు. భద్రాద్రి థర్మల్​ పవర్​ స్టేషన్​ నిర్మాణ కార్మికులకు ప్లాంట్​లో శాశ్వత ఉపాధి కల్పించాలని కోరుతూ వర్కర్లు కలెక్టరేట్​ ఎదుట ధర్నా నిర్వహించారు. 

షర్మిల అరెస్ట్​ అప్రజాస్వామికం

ఖమ్మం టౌన్, వెలుగు: రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకొనేందుకు పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్​టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్​ చేయడం అప్రజాస్వామికమని ఆ పార్టీ ఖమ్మం ఇన్​చార్జి తుంపాల కృష్ణమోహన్  అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, ప్రజలకు దగ్గర కావడాన్ని జీర్ణించుకోలేక దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. పాదయాత్రకు ఆటంకం కలిగించేందుకు కుట్ర చేస్తున్నారని 
విమర్శించారు. 

పాదయాత్రపై దాడి సరైంది కాదు

వైరా: వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర బస్సును దహనం చే యడం సరైంది కాదని వైరా నియోజకవర్గ కో ఆర్డినేటర్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మండల అధ్యక్షుడు పీవీఎం ప్రసాద్  అన్నారు. సోమవారం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రజల నుంచి వస్తున్న ఆదర ణను జీర్ణించుకోలేక దాడికి పాల్పడ్డారని విమర్శించారు. ఈ ఘటనకు పాల్పడిన వారి ని అరెస్ట్  చేయాలని డిమాండ్ చేశారు. వాక దాని శ్రీనివాసరావు, నందిగామ మనోహర్, వల్లెపు రాము, సైదుబాబు పాల్గొన్నారు.