ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కూతుళ్లను చంపిండు

ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కూతుళ్లను చంపిండు

 ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. వెంకటేశ్వర్లు  అనే వ్యక్తి తన   కన్నతల్లితో సహా  ఇద్దరు కూతుళ్లను హత్య చేసి పరారయ్యాడు. కొన్నేళ్ల క్రితం వెంకటేశ్వరరావు  భార్య అనుమానాస్పదంగా మృతి చెందడంతో  తన తల్లి పిచ్చమ్మతో పాటు ,అతని ఇద్దరి కూతుళ్లు నీరజ, ఝాన్సీతో కలిసి ఉంటున్నాడు.  కుటుంబ కలహాలు, ఆర్థిక లావాదేవీల వల్ల  ముగ్గురిని చంపి పరారయ్యిండు. తెల్లవారుజామున ముగ్గురు విగత జీవులై కనిపించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

వెంకటేశ్వర్ రావు  స్థానికంగా ఉండే వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని పిల్లన్ని కూడా పట్టించుకోవడం లేదని  గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. తన తల్లి పేరు ఉన్న ఎకరం భూమిని అమ్మేందుకు  ఒప్పుకోకపోవడంతో  అడ్డుగా ఉన్న తల్లిని ఇద్దరు పిల్లల్ని చంపి పారిపోయాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.