- పోలీసుల వేధింపులే కారణమన్న కుటుంబీకులు
ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం జిల్లా తెలంగాణ నాన్ గెజిటెడ్ అఫీసర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు షేక్ అఫ్జల్ హసన్ శనివారం రాత్రి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే ఖమ్మంలోని ప్రైవేట్ హాస్పిటల్ కు అక్కడి నుంచి ఖమ్మం వైరా రోడ్డు ఆర్సీఎం చర్చి ఎదురుగా ఉన్న మరో హాస్పిటల్ కు తరలించి చికిత్స అందజేస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
కక్ష కట్టి కేసు పెట్టించారు
ఖమ్మంలోని భూమికి సంబంధించి సంతకాల ఫోర్జరీ కేసులో అఫ్జల్నిందితుడిగా ఉన్నారు. ఆయన ఇటీవల అరెస్టయి బెయిల్ పై బయటకు వచ్చారు. అయితే, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆయనపై కక్ష కట్టిన కొందరు కావాలనే తప్పుడు కేసులు పెట్టించి వేధించారని, అందుకే మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేశాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.