‌‌‌‌విద్యార్థికి గుండు కొట్టించిన ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌ సస్పెన్షన్

‌‌‌‌విద్యార్థికి గుండు కొట్టించిన ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌ సస్పెన్షన్
  • విచారణ కమిటీ  రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం 

ఖమ్మం, వెలుగు:  ఖమ్మం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఫస్టియర్​ స్టూడెంట్ కు గుండు కొట్టించిన అసిస్టెంట్ ప్రొఫెసర్​ రెహ్మాన్​ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటనను కాలేజీ ప్రిన్సిపల్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ సోమవారం విచారించింది. అనస్తీషియా హెచ్ఓడీ డాక్టర్ రవి, అకడమిక్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సరిత, జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ డాక్టర్ రాజు ఎంక్వైరీ జరిపారు. హాస్టల్​ లో ఉన్న స్టూడెంట్స్ తో పాటు, కాలేజీ సిబ్బందిని కూడా విచారించారు. బాధిత స్టూడెంట్ ను పిలిచి, ఘటనపై వాంగ్మూలం తీసుకున్నారు.

అసిస్టెంట్ ప్రొఫెసర్​ రెహ్మాన్​ ను కూడా విచారించారు. తర్వాత రిపోర్ట్ ను ఉన్నతాధికారులకు పంపించారు. యాంటీ ర్యాగింగ్ కమిటీ చైర్మన్​గా ఉండి రెహ్మాన్​ ప్రవర్తించిన తీరు తప్పేనని రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంటర్నల్​ ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా అసిస్టెంట్ ప్రొఫెసర్​ రెహ్మాన్​ ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ ఉత్తర్వులు జారీ చేశారు.