సాగర్ నీళ్లు విడుదల చేయాలంటూ రైతుల రాస్తారోకో

ఖమ్మం జిల్లాలోని బోనకల్–జగ్గయ్యపేట ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. సాగర్ నీళ్లను వెంటనే విడుదల చేయాలని జగ్గయ్యపేట రైతులు డిమాండ్ చేశారు. తమ పంటలు ఎండిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లిచ్చి న్యాయం చేయాలంటూ పురుగుల మందు డబ్బాలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వెంటనే ట్రాఫిక్ పోలీసులు స్పందించి.. ఎన్ఎస్పి కాలువ ద్వారా నీళ్లు విడుదల చేసేలాని అధికారులతో మాట్లాడుతామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు వెనుదిరిగారు.