పత్తి రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు : అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి

పత్తి రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు : అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి
  • జిన్నింగ్ మిల్లులను తనిఖీ చేసిన  ఖమ్మం అదనపు కలెక్టర్ 
  • నాణ్యమైన పత్తిని మద్దతు ధరకు కొనుగోలు చేయాలి

ఖమ్మం టౌన్, వెలుగు:  జిన్నింగ్ మిల్లులకు వచ్చే పత్తి రైతులకు ఇబ్బందులు కలగజేయకుండా నాణ్యమైన పత్తిని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడు గ్రామంలోని జిఆర్ఆర్ ఇండస్ట్రీ, తల్లంపాడు గ్రామంలోని శ్రీ బాలాజీ, పొన్నెకల్ గ్రామంలోని  జీఆర్ఆర్ జిన్నింగ్ మిల్లులను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ..  ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు 3,648 మంది రైతుల నుంచి 8,487 మెట్రిక్ టన్నుల పత్తి మద్దతు ధరపై కొనుగోలు చేశామన్నారు.   ఈ తనిఖీల్లో అదనపు కలెక్టర్ వెంట జిల్లా మార్కెటింగ్ అధికారి ఎం.ఏ. అలీం, సీసీఐ ప్రతినిధి అవినాష్, మార్కెట్ కార్యదర్శులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, వీరాంజనేయులు, వ్యవసాయ విస్తరణ అధికారులు ఆదర్శ్, హిమబిందు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.