మహిళ కడుపులో 5 కేజీల కణితి తొలగించిన డాక్టర్లు

మహిళ కడుపులో 5 కేజీల కణితి తొలగించిన డాక్టర్లు
  • ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ల 
  • అరుదైన ఆపరేషన్  

ఖమ్మం టౌన్, వెలుగు : మహిళ కడుపులో కణితిని ఆపరేషన్ ద్వారా తొలగించిన ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి డాక్టర్లు ఆమె ప్రాణాలు కాపాడారు. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన సుశీల కొన్నేండ్లుగా తీవ్ర కడుపు నొప్పి, ఉబ్బరంతో బాధపడుతోంది. భరించలేక శుక్రవారం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. మాతా శిశు సంరక్షణ విభాగానికి చెందిన డాక్టర్లు టెస్ట్ లు చేసి ఆమె కడుపులో భారీ కణితి ఉన్నట్టు గుర్తించారు. 

వెంటనే సర్జరీ చేసి 5 కేజీల కణితిని(ఓవరియన్ సిస్ట్) తీశారు. క్లిష్టమైన ఆపరేషన్ చేసి మహిళ ప్రాణాలను రక్షించినందుకు ఆస్పత్రికి చెందిన డాక్టర్ యామిని(హెచ్ఓడీ ఓబీఎస్) డాక్టర్ అపర్ణ, ప్రొఫెసర్ డాక్టర్ రాధిక, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీవిద్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాధిక ను ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎల్.కిరణ్ కుమార్, ఆర్ఎంఓ డాక్టర్ రాంబాబు అభినందించారు.