ఖమ్మంలో ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ సెలక్షన్స్

ఖమ్మంలో ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ సెలక్షన్స్

ఖమ్మం, వెలుగు : ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో మంగళవారం ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ సెలక్షన్ జరిగాయి. ఇందులో 12 క్రీడా విభాగాల్లో 248 మంది ప్రభుత్వ ఉద్యోగులు పోటీపడ్డారు. అథ్లెటిక్స్, చెస్, క్రికెట్, క్యారమ్స్, వాలీబాల్, ఖోఖో, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, యోగ, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, బెస్ట్ ఫిజిక్ విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయి. పోటీల్లో గెలిచిన 142 మంది ఈనెల 23, 24న హైదరాబాద్​లో జరిగే రాష్ట్రస్థాయిలో పోటీల్లో పాల్గొననున్నారు.