ఖమ్మంలో ఇంటర్ స్టూడెంట్ సూసైడ్

ఖమ్మంలో ఇంటర్ స్టూడెంట్ సూసైడ్
  • హాస్టల్‌‌‌‌‌‌‌‌లో ఫ్యాన్‌‌‌‌‌‌‌‌కుఉరి వేసుకున్న విద్యార్థిని 
  • ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మంలో ఓ ఇంటర్ 

 ఖమ్మం : ఖమ్మంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఏపీలోని ఏటపాక మండలం చింతలగూడెం గ్రామానికి చెందిన సత్యరాజు, మంజుల దంపతుల కుమార్తె యోగనందిని (17).. ఖమ్మంలోని ఓ జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీ హాస్టల్‌‌‌‌‌‌‌‌లో ఉంటూ ఇంటర్​ఫస్టియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చదువుతోంది. శుక్రవారం ఉదయం హాస్టల్‌‌‌‌‌‌‌‌లో తన ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌తో కలిసి స్టడీ అవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హాజరైంది. స్టడీ అవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండగానే వాష్ రూమ్‌‌‌‌‌‌‌‌కు వెళ్లొస్తానని చెప్పి బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లింది.

వాష్ రూంకు వెళ్లిన యోగనందిని ఇంకా రాకపోవడంతో వార్డెన్ వెళ్లి స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ గదిలో చూడగా ఫ్యాన్‌‌‌‌‌‌‌‌కు ఉరివేసుకుని కనిపించింది.దీంతో విషయం తెలుసుకున్న యోగనందిని తల్లిదండ్రులు పలు విద్యార్థి సంఘాలతో కలిసి కాలేజీ ఎదుట 2 గంటల పాటు ధర్నా నిర్వహించారు. ఆత్మహత్యకు కాలేజ్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ వైఖరే కారణమని వారు మండిపడ్డారు. కాగా, అనారోగ్యం కారణంగానే తన కూతురు ఎగ్జామ్స్​ రాయలేక మనస్తాపం చెంది సూసైడ్​ చేసుకుందని యోగనందిని తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.