ఖమ్మంలో మెడికల్ కాలేజీ ప్రారంభం

  • ప్రారంభించనున్న మంత్రులు హరీశ్​ రావు, అజయ్​కుమార్​

ఖమ్మం కార్పొరేషన్​, వెలుగు : జిల్లాలోని  ప్రభుత్వ మెడికల్ కాలేజీని మంత్రులు  హరీశ్​రావు,  పువ్వాడ అజయ్​కుమార్ గురువారం  ప్రారంభించనున్నారు. అలాగే నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను  కలెక్టర్ వి.పి. గౌతమ్ బుధవారం  పరిశీలించారు.  మద్దులపల్లిలో నర్సింగ్ కాలేజీ స్థలాన్ని పరిశీలించారు. నర్సింగ్ కళాశాలను 5 ఎకరాల్లో రూ. 25 కోట్లతో నిర్మిస్తున్నట్లు తెలిపారు.  

అనంతరం యూత్ ట్రైనింగ్ సెంటర్ లో నర్సింగ్ కళాశాల తాత్కాలిక నిర్వహణకు భవనాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.  రాజేశ్వరరావు,  ఆర్డీవో  గణేశ్, నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ రత్నకుమారి,  అధికారులు తదితరులు ఉన్నారు.

 మమత కళాశాల రజతోత్సవ వేడుకలు...

మమత వైద్య కళాశాల ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలకు మంత్రులు హరీశ్​రావు,  అజయ్​కుమార్​ హాజరు కానున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభోత్సవం అనంతరం మమత వైద్యశాలకు చేరుకుని కొత్తగా నిర్మించిన సిల్వర్ జూబ్లీ బ్లాక్​ను ప్రారంభించనున్నారు.