ఖమ్మం మార్కెట్కు పోటెత్తిన మిర్చి.. 90 వేల బస్తాలు తెచ్చిన రైతులు.. క్వింటా ధర ఎంత పలికిందంటే..

ఖమ్మం మార్కెట్కు పోటెత్తిన మిర్చి.. 90 వేల బస్తాలు తెచ్చిన రైతులు.. క్వింటా ధర ఎంత పలికిందంటే..
  • జెండా పాటగా క్వింటాకు రూ. 14, 050 పలికిన ధర
  • అదనపు ఖర్చుల పేరిట దోపిడీ చేస్తున్నారని రైతుల ఆవేదన

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు గురువారం 90 వేల బస్తాల మిర్చి అమ్మకానికి వచ్చింది. జెండా పాటగా క్వింటాకు రూ.14,050 ధర పలికింది. గ్రేడ్లను బట్టి ట్రేడర్లు రూ. 10 వేల నుంచి రూ. 13 వేల వరకు ధర పెట్టి కొనుగోలు చేశారు. ధర తగ్గుముఖం పట్టడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. రాత్రి వేళల్లో వాహనాల్లో మిర్చి తెస్తే.. ప్రైవేట్ హమాలీలు దిగుమతి పేరుతో బస్తాకు రూ. 5 నుంచి రూ. 7, కాంటా వేసినందుకు బస్తకు మరో రూ. 3 , కమీషన్ దార్లు కటింగ్ పేరుతో ఇంకో రూ. 3  నుంచి రూ. 5 వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అదనపు ఖర్చుల పేరిటి మార్కెట్ లో దోపిడీ ఎక్కువైందని మండిపడుతున్నారు.  కట్టడి చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడంలేదని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.