వెంకటాపురం, వెలుగు : భద్రాచలం నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌కు ఒక్క ఛాన్స్ ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఖమ్మం ఎమ్మెల్సీ తాతా మధు చెప్పారు. బీఆర్‌ఎస్ క్యాండిడేట్ తెల్లం వెంకట్రావుతో కలిసి శుక్రవారం ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న పార్టీ నేతను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు.
ఆరు గ్యారంటీలతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ 60 ఏళ్లలో ఏం అభివృద్ధి చేసిందని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో వెంకట్రావుని గెలిపిస్తే భద్రాచలం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా నాయకుడు గుడపర్తి నర్సింమూర్తి ఆధ్వర్యంలో పలువురు బీఆర్‌ఎస్‌లో జాయిన్ అయ్యారు. తెలంగాణ ఉద్యమకారుడు చిడం రవికుమార్, సత్యనారాయణ, శ్రీనివాసరావు పాల్గొన్నారు.