![సీఎం రేవంత్ ను కలిసిన ఖమ్మం ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి](https://static.v6velugu.com/uploads/2024/04/khammam-mp-candidate-raghuram-reddy-met-cm-revanth-reddy1_K4Pgkbm63p.jpg)
హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు ఖమ్మం ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి. ఎంపీగా తనను ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రఘురాం రెడ్డి వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.
మరోవైపు సీఎం నివాసంలో రేవంత్ ను కలిశారు మంత్రి పొన్నం, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఆదిశ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం. వెలిచాల రాజేందర్ రావుకు బీ ఫామ్ అందించారు సీఎం రేవంత్ రెడ్డి. వీరితో పాటు నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కూడా సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అభ్యర్థి తీన్మార్ మల్లన్న కూడా సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.