మదన్​లాల్ గెలుపునకు కృషి చేయాలి: నామా నాగేశ్వరరావు

కారేపల్లి, వెలుగు: బీఆర్ఎస్​మేనిఫెస్టో అన్ని వర్గాలను ఆకట్టుకుంటోందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు చెప్పారు. కారేపల్లి మండల బీఆర్ఎస్​ముఖ్యనేతలు, సమన్వయ కమిటీ సభ్యులతో బుధవారం ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దూరదృష్టితో రూపొందించిన మేనిఫెస్టోను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని సూచించారు.

చిన్న, చిన్న పొరపొచ్చాలను వదిలేసి వైరా బీఆర్ఎస్​అభ్యర్థి మదన్​లాల్ గెలుపు కోసం కష్టపడాలన్నారు. కాంగ్రెస్​పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీములకు వారంటీలేదని విమర్శించారు. సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్​రావు, వైరా క్యాండిడేట్​మదన్​లాల్, రైతు బంధు జిల్లా కన్వీనర్​నల్లమల వెంకటేశ్వరరావు, కారేపల్లి ఎంపీపీ శకుంతల, చీమలపాడు సర్పంచ్​కిశోర్​పాల్గొన్నారు.