ఖమ్మం నగరంలోని 36, 37వ డివిజన్లలో కేఎంసీ కమిషనర్ పర్యటన

ఖమ్మం నగరంలోని 36, 37వ డివిజన్లలో కేఎంసీ కమిషనర్ పర్యటన

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగరంలోని 36, 37వ డివిజన్లలో బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పర్యటించారు. డివిజన్ లోని రైల్వే ట్రాక్ మూడో లైన్ సర్వే, నిర్మాణ పనులను ఎలా జరుగుతున్నాయి, ట్రాక్ విస్తరణ కోసం ఎంత భూమిని సేకరించారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. కాంక్రీట్ వాల్ ఎన్ని మీటర్ల దూరంలో నిర్మిస్తున్నారనేది పరిశీలించారు. రైల్వే ట్రాక్ కింద నుంచి వెళ్తున్న  డ్రైన్లలోకి ఏ డివిజన్ల లో నుంచి డ్రైన్ వాటర్, ఏ డ్రైన్ కు వస్తున్నది అడిగి తెలుసుకున్నారు.

క్రైమ్ పోలీస్ స్టేషన్ దగ్గరనుంచి వస్తున్న  డ్రైన్, వేరే అండర్ పాస్ ద్వారా హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ పక్క నుంచి కొత్తగా పెద్ద డ్రైన్ ను నిర్మించి అక్కడి నుంచి పోయేలా డిజైన్ చేయాలని ఈఈకి సూచించారు.  జీవీ మాల్ నుంచి వస్తున్న వరద నీటి కోసం ఉన్న డ్రైవ్ సిస్టంను పరిశీలించి డ్రైన్ వెడల్పు పెంచేలా డిజైన్ చేయాలన్నారు. అనంతరం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసే పటాకుల దుకాణాల ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే ఏడీఈ, అసిస్టెంట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ షఫీ ఉల్లా, ఈఈ కృష్ణలాల్ ఉన్నారు.