- నిర్మాణ ప్రతినిధులకు మంత్రి తుమ్మల సూచన
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం మున్నేరు రిటర్నింగ్ కాంక్రీట్ వాల్ నిర్మాణ పనులను వర్షాకాలం రాకముందే కంప్లీట్ అయ్యేలా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేబుల్ బ్రిడ్జి నిర్మాణ సంస్థ ప్రతినిధులకు సూచించారు. శుక్రవారం మంత్రి తుమ్మల క్యాంపు కార్యాలయంలో నిర్మాణ ప్రతినిధులు మున్నేరు కాంక్రీట్ వాల్ నిర్మాణ ప్లానింగ్ ప్రణాళికను నాగేశ్వరరావుకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇరిగేషన్ శాఖతో సమన్వయం చేసుకుని పనుల చేయాలన్నారు. చెక్ డ్యామ్ నిర్మించడం వల్ల భూగర్భ జలాలు పెరిగేందుకు దోహదపడతాయని చెప్పారు. ఓల్డ్ బ్రిడ్జిని సుందరీకరించి టూరిస్ట్ ప్లేస్ గా డెవలప్ చేయాలని సూచించారు. ట్రాఫిక్ పోలీస్ వారి సలహాలు, సూచనల ప్రకారం ట్రాఫిక్ ను నియంత్రించేలా ప్రణాళిక తయారు చేయాలని చెప్పారు.