అశ్వారావుపేట, వెలుగు : కాంగ్రెస్ ఆరు హామీలు నెరవేర్చకపోగా మాయమాటలతో మళ్లీ మోసం చేసేందుకు చేస్తోందని ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ సెంటర్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అభివృద్ధి పథంలో నడిపించారన్నారు.
ఇక్కడి పామాయిల్ రైతులను దృష్టిలో ఉంచుకొని 90 టన్నుల సామర్థ్యం గల ఫ్యాక్టరీని నిర్మిస్తున్న ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, ములకలపల్లి జ్పడీటీసీ సున్నం నాగమణి, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, సూర్య ప్రకాశ్‌రావు, తాడేపల్లి రవి పాల్గొన్నారు.