సింగరేణి మనుగడ కోసం కృషి చేస్తా

సింగరేణి మనుగడ కోసం కృషి చేస్తా
  • ఖమ్మం పార్లమెంట్​ కాంగ్రెస్​ అభ్యర్థి రఘురాంరెడ్డి 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి మనుగడ కోసం కృషి చేస్తానని ఖమ్మం పార్లమెంట్​కాంగ్రెస్​అభ్యర్థి రఘురాంరెడ్డి అన్నారు. శుక్రవారం సింగరేణి కాలరీస్​ కొత్తగూడెం ఏరియా, కార్పొరేట్​ పరిధిలోని మైన్స్​, డిపార్ట్​మెంట్లలో ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై పోరాడుతానని చెప్పారు. అనంతరం అనారోగ్యంతో మృతి చెందిన సీపీఐ సీనియర్​ లీడర్​ బందెల నర్సయ్య మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ ప్రోగ్రాంలో కాంగ్రెస్​, ఐఎన్టీయూసీ నాయకులు పాల్గొన్నారు.  

బీఆర్ఎస్, బీజేపీ మధ్య అంతర్గత పొత్తు 

మధిర, వెలుగు :  బీఆర్ఎస్, బీజేపీ మధ్య అంతర్గత పొత్తు ఉండడంతోనే నామా నాగేశ్వరావుకు కేంద్రమంత్రి అంటూ కేసీఆర్ ప్రచారం చేస్తున్నారని రఘురాంరెడ్డి అన్నారు. శుక్రవారం మధిరలో ఆయన  స్విమ్మర్స్, వాకర్స్ ను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ముస్లిం సోదరుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, రాహుల్ గాంధీని  ప్రధానిగా చూడాలంటే  ప్రతి ఒక్కరూ మద్దతు ఇచ్చి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణు,  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.