మైనర్​ను వేధించిన నలుగురిపై పోక్సో కేసు

మధిర, వెలుగు: ఖమ్మం జిల్లాలో పదహారేండ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నలుగురు బాలురపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతకాని మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(16) చదువు మధ్యలోనే ఆపేసి ఇంటి వద్ద ఉంటోంది. ఈ క్రమంలో పక్కింటి బాలుడు ఆమెకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. 

విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన మరో ముగ్గురు మైనర్లు బాలికను బ్లాక్​ మెయిల్​ చేసి లైంగికంగా వేధిస్తున్నారు. ఇటీవల బాలిక శరీరంలో మార్పులు రావడాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. డాక్టర్ వద్దకు తీసుకెళ్లగా ఆమె 7 నెలల గర్భిణి అని తేలింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో శుక్రవారం చింతకాని పోలీసులు నలుగురు నిందితులపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.