సత్తుపల్లి, వెలుగు : యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. మంగళవారం సత్తుపల్లిలోని పోలీస్ స్టేషన్ ను ఆయన సందర్శించారు. స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ అక్రమ రవాణా నియంత్రించాలని, దొంగతనాల కట్టడికి రాష్ట్ర సరిహద్దు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. గతనెలలో గంజాయి సప్లై చేస్తూ పట్టుబడిన కేసులో నిందితులను గుర్తించి వారితో పాటు వారి తల్లిదండ్రులకు మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పప్రయోజనలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు.