నంబర్ ప్లేట్ లేని వెహికల్స్​ నడిపితే కేసులు : సీపీ సునీల్ దత్

నంబర్ ప్లేట్ లేని వెహికల్స్​ నడిపితే కేసులు : సీపీ సునీల్ దత్
  •     ఖమ్మం సీపీ సునీల్ దత్

ఖమ్మం టౌన్, వెలుగు :  నంబర్ ప్లేట్ లేకుండా వెహికల్స్​ నడిపితే కేసులు నమోదు చేస్తామని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్  ను సందర్శించారు. నగరంలో నంబర్ ప్లేట్ లేకుండా డ్రైవ్​ చేస్తూ పట్టుబడిన 45 మంది ద్విచక్ర వాహనదారులకు సీపీ కౌన్సిలింగ్ ఇచ్చారు. చైన్ స్నాచింగ్, దొంగతనాలు చేస్తున్న దుండగులు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వాహనాల నంబరు ప్లేట్ తొలగిస్తున్నారని చెప్పారు.

ఈ క్రమంలో ఇలాంటి వెహికల్స్​పై స్పెషల్ డ్రైవ్‌ చేయాలని నిర్ణయించామన్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చినా ఎంవీ యాక్ట్ కింద కేసులను నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు, సీఐ మోహన్ బాబు, ఎస్సై రవి, సాగర్ పాల్గొన్నారు.