బెట్టింగులపై స్పెషల్​ ఫోకస్ : సీపీ సునీల్​దత్​

బెట్టింగులపై స్పెషల్​ ఫోకస్ : సీపీ సునీల్​దత్​
  • ఖమ్మం సీపీ సునీల్​దత్​

ఖమ్మం టౌన్, వెలుగు :  ఐపీఎల్ బెట్టింగులపై స్పెషల్​ ఫోకస్​ పెట్టామని, పలు సెంక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పోలీస్​ అధికారులను ఆదేశించారు. మంగళవారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ లో పోలీస్ అధికారులతో జరిగిన నేర సమీక్ష సమావేశంలో పోలీస్ స్టేషన్ల వారీగా నమోదైన కేసుల్లో విచారణ స్థితిగతులు, పెండింగ్ కేసుల పురోగతిపై ఆరా తీశారు. బెట్టింగ్, లోన్ యాప్ కార్యకలాపాలపై నిఘాను పెంచాలని సూచించారు. 

 కీలకమైన కేసుల్లో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. తీవ్రమైన నేరాలు, పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల దర్యాప్తుల్లో  మరింత నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు. రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ పై తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ ఆడ్మిన్ నరేశ్​కుమార్, ట్రైనీ ఐపీఎస్ అధికారి సాయి రిత్విక్, ఏసీపీలు రమణమూర్తి, తిరుపతి రెడ్డి, రహెమాన్, రఘు, వెంకటేశ్, సాంబరాజు, రవి, సర్వర్, శ్రీనివాసులు పాల్గొన్నారు.