ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించాలి : విష్ణు యస్.వారియర్

ఖమ్మం టౌన్, వెలుగు : ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా సమన్వయంతో పనిచేయాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అధికారులకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మంగళవారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్​లో అధికారుల ఎన్నికల విధులు, విధివిధానాలు, శాంతిభద్రతల పరిరక్షణ అంశాలపై మంగళవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఎన్నికల సంఘం నియంత్రణలో క్రమశిక్షణకు లోబడి పనిచేయాలన్నారు. ఎలాంటి పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలని సూచించారు. పోలీస్ అధికారులు సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.  

ఎన్నికల నిర్వహణలో క్రిటికల్ పోలింగ్ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండాలన్నారు. ఎన్నికల విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతల సమస్యలు సృష్టించేందుకు ఎక్కువ  అవకాశం ఉన్న సోషల్ మీడియా పోస్టులు

వీడియోలు వైరల్ చేసే ఏ చిన్న విషయమైన  పై అధికారులకు సమాచారం అందించాలని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా అండ్​ ఆర్డర్ ప్రసాద్ రావు, ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఏసీపీలు గణేశ్, హరికృష్ణ, భస్వారెడ్ది, రహెమాన్, రామానుజం, సారంగపాణి, ప్రసన్న కుమార్, రవికుమార్, శివరామయ్య, సుశీల్ సింగ్, నర్సయ్య పాల్గొన్నారు.