
ఖమ్మం, వెలుగు: ఈ నెల 27న నిర్వహించనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలో సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ ( సెక్షన్163) అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి ఈనెల 27 సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.
ప్రజలు ఐదుగురు కంటే ఎక్కువ మంది గుంపులుగా ఉండొద్దని పేర్కొన్నారు. ఎవరూ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయొద్దని, కవ్వింపు చర్యలకు పాల్పడొద్దని తెలిపారు. ఎక్కడైనా డబ్బు, మద్యం, ఉచిత కానుకల ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడంతో పాటు ఓటర్లను భయబ్రాంతులకు గురి చేయకూడదని తెలిపారు. ఓటర్లకు భద్రత రీత్యా ఎలాంటి సమస్యలు ఎదురైనా డయల్ 100కి ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు