
పెనుబల్లి, వెలుగు : రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లోమెడల్స్ సాధించిన పోలీసులను ఖమ్మం సీపీ సునీల్‌దత్ బుధవారం అభినందించారు. ఇటీవల జరిగిన మూడవ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో విఎం బంజరు పీఎస్‌లో కానిస్టేబుల్స్‌గా పని చేస్తున్న ఎస్కే మజీద్ పాషా షాట్ ఫుట్‌లో గోల్డ్ మెడల్ సాధించగా, బి వెంకటేశ్వరరావు హ్యాండ్ బాల్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించారు. దీంతో సీపీ కార్యాలయంలో వారిని అభినంధించారు. మెడల్ సాధించిన సిబ్బందికి సత్తుపల్లి రూరల్ సీఐ ముత్తులింగయ్య, ఎస్సై వెంకటేశ్ శుభాకాంక్షలు తెలిపారు.