ఖమ్మం రీజియన్​కు రూ. 32కోట్ల ఆదాయం

 ఖమ్మం రీజియన్​కు రూ. 32కోట్ల ఆదాయం
  •     రీజినల్​ మేనేజర్​ సరిరాం
  •     ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 20 కొత్త రాజధాని బస్సులు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్​ నుంచి సెప్టెంబర్​ వరకు ఖమ్మం రీజియన్​కు రూ. 32 కోట్ల ఆధాయం వచ్చిందని రీజినల్​ మేనేజర్​ సరిరాం పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆర్టీసీ డిపోల్లో మంచి ప్రతిభ చూపిన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్​లతో పాటు బెస్ట్​ బస్టాండ్లుగా తయారు చేసిన వారిని కొత్తగూడెం డిపోలో ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో శుక్రవారం ఆయన సన్మానించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక డ్రైవర్​ 19వేలు ఇన్సెంటీవ్​ తీసుకోవడం అభినందనీయమన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం డిపోకు ఎక్కువగా బెస్ట్​ అవార్డులు రావడం అభినందనీయమన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పాత వాటి స్థానంలో  20 కొత్త  రాజధాని బస్సులు వచ్చాయని తెలిపారు.  మరో పదికి పైగా రావాల్సి ఉందన్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

కార్తీక మాసం సందర్భంగా  పంచారామాలతోపాటు అన్నవరం, అరుణాచలం పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. ఈ ప్రోగ్రాంలో డిప్యూటీ ఆర్​ఎం పవిత్ర, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, భద్రాచలం, మధిర, మణుగూరు డిపో మేనేజర్లు ఎం. దేదేంవర్​గౌడ్​, రాజ్యలక్ష్మి, శంకర్​రావు, దినేశ్​కుమార్​, శ్యాంసుందర్​, పీఓ నారాయణ, సూపర్​ వైజర్​ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.