సంక్రాంతికి ఖమ్మం ఆర్టీసీ ఆదాయం రూ.20.73 కోట్లు

సంక్రాంతికి ఖమ్మం ఆర్టీసీ ఆదాయం రూ.20.73 కోట్లు

ఖమ్మం టౌన్, వెలుగు  : ఖమ్మం ఆర్టీసీ రీజియన్ లో ఈనెల 9 నుంచి 20 తేదీ వరకు హైదరాబాద్ నుంచి ఉమ్మడి జిల్లాలకు, అదేవిధంగా హైదరాబాద్ కు ఉమ్మడి జిల్లాల నుంచి 1,030 బస్సు సర్వీస్ లను నడపడం ద్వారా 30.96 లక్షల కిలోమీటర్లు తిప్పి  రూ.20.73 కోట్ల ఆదాయం సంపాదించినట్లు  ఆర్టీసీ ఆర్ఎం సరిరాం తెలిపారు. మొత్తం 25.80 లక్షల మంది బస్సు లో ప్రయాణించినట్లు పేర్కొన్నారు. ఇందులో 15.97 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. సత్తుపల్లి డిపో ఆంధ్ర సరిహద్దు లో ఉండటంతో ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా 150 రిజర్వేషన్ సర్వీస్ లను నడిపినట్లు చెప్పారు. జిల్లాలోని 7 డిపోల నుంచి అవిశ్రాంతంగా శ్రమించిన డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్వైజర్లు, మెకానిక్ ల కృషిని ఆర్ఎం అభినందించారు.