ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగరంలోని వీడీఓఎస్ కాలనీలో ఉన్న సర్వజ్ఞ స్కూల్ కు చెందిన స్టూడెంట్ ఎ.నివేదిత సోషిని జిల్లాస్థాయి స్కేటింగ్ పోటీలో సిల్వర్, బ్రాంజ్ పతకం ను గెలుచుకుంది.
ఈనెల 22న సిటీలోని సర్దార్ పటేల్ స్టేడియంలో స్కేటింగ్ అసోసియేషన్ నిర్వహించిన పోటీలో సత్తా చాటింది. ఈ సందర్భంగా మంగళవారం ఎ. నివేదిత సోషిని స్కూల్ డైరెక్టర్స్ ఆర్వీ నాగేంద్ర కుమార్, నీలిమా అభినందించారు.