సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడినందుకు ఫైన్

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలో మమతా రోడ్డులో కొంత మంది వీధి వ్యాపారులు సింగిల్ యూస్ ప్లాస్టిక్ వినియోగిస్తున్నారు. విషయం తెలుసుకున్న కేఎంసీ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. నిషేధిత కవర్లను వాడుతూ రోడ్డు పై గార్బేజ్ వేస్తున్నందున ఓ వ్యాపారికి రూ.6,500 ఫైన్ ను వేశారు.