బార్బడోస్లో గుండెపోటుతో ఖమ్మం విద్యార్థి మృతి

చదువుకుని గొప్ప వాడినై తిరిగొస్తా.. అంటూ బయటి దేశం వెళ్లిన కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. చేతికి అందొచ్చని కొడుకు ఇక లేడనే వార్త విన్న తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. ఖమ్మ జిల్లా, పెదతండాకు చెందిన హేమంత్ శివరామకృష్ణ (20).. కరేబియన్ దీవుల్లోని బార్బడోస్ లో ఎంబీబీస్ సెంకండ్ ఇయర్ చదువుతున్నాడు. అతని తండ్రి రవికుమార్ ఖమ్మం ట్రాఫిక్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు.

మంగళవారం స్కేహితులతో కలిసి బార్బడోస్ లోని బీచ్ కు వెళ్లాడు శివరామకృష్ణ. బీచ్ లో ఈత కొట్టి వచ్చిన కొంతసేపటికి గుండెలో నొప్పిం అంటూ కుప్పకూలింపోయాడు. దాంతో శివరామకృష్ణను అతని స్నేహితులు హాస్పిటల్ కు తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్దారించారు. శివరామకృష్ణ మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు బార్బడోస్ లోని భారతీయులు ప్రయత్నాలు చేస్తున్నారు.