ఈతకు వెళ్లి అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి

ఈతకు వెళ్లి అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి

కల్లూరు, వెలుగు: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకొండికి చెందిన శ్రీనాథరాజు కిరణ్  రాజు (23) అమెరికాలో చనిపోయాడు. మిస్సోరి స్టేట్ లో ఉన్న సాండ్  హిల్స్  టౌన్ లో కిరణ్​ రాజు శనివారం తన ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి ఈతకు వెళ్లాడు. 

ఈత రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు.  కిరణ్ తండ్రి లక్ష్మణరాజు గతంలోనే చనిపోగా తల్లి ప్రస్తుతం హైదరాబాద్ లో  ఉంటున్నది. వీరి బాధ్యతలను కిరణ్  తాత కృష్ణమూర్తి రాజు చూస్తున్నారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన కొడుకు చనిపోయినట్లు సమాచారం అందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంఎస్  చేసేందుకు నిరుడు నవంబరులో  కిరణ్  అమెరికా వెళ్లాడు.