డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లొల్లి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ

ఖమ్మం టౌన్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం లబ్ధిదారులు రచ్చ రచ్చ చేశారు. వైఎస్సార్ నగర్ లోని 8వ డివిజన్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కారును లబ్ధిదారులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

ALSO READ: బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. కుర్చీలతో పొట్టు పొట్టు కొట్టుకున్న కార్యకర్తలు
 

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది.