ఎడతెరిపిలేని వానలు..పొంగిపొర్లుతున్న నదులు, వాగులు, చెరువులు..గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాలనీలన్నీ నీటి మునిగాయి. ఎక్కడ చూసినా నీళ్లే..ఇండ్లలో మోకాల్లోతు నీళ్లు.. చెరువులను తలపిస్తున్న కాలనీలు..పాలేరు వాగు ఉగ్రరూపం..చెరువుల్లా కాలనీలు..విరిగిన పడినచెట్లు..కొట్టుకుపోతున్న ప్రజలు.. ఇదీ ఆదివారం నాటి ఖమ్మ పట్టణం దుస్థితి.. డ్రోన్ ద్వారా తీసిన విజువల్స్.. భారీ వర్షాలకు ఖమ్మం పట్టణ పరిస్థితికి అద్దంపడుతున్నాయి.
గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ఉగ్ర రూపం దాల్చింది. ప్రకాశ్ నగర్ వద్ద డేంజర్ లెవల్లో మున్నేరు ప్రవహిస్తోంది. దీంతో ఖమ్మం పట్టణంలోని ఇండ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఇళ్ల మధ్య నుంచి మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.. పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రకాశ్ నగర్ వద్ద మున్నేరు వాగు గోదావరి నదిని తలపిస్తోంది.
మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండంతో ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయికన్ గూడెం వద్ద ముగ్గురు యువకులు వరదల్లో చిక్కుకున్నారు. సిమెంట్ బ్రిక్స్ తయారీ కేంద్రం ఉన్నా ఇల్లును వరద చుట్టుముట్టడంతో ముగ్గురు యువకులు ఇంటిపైకి ఎక్కారు.
బాధితులతో మాట్లాడిన పొంగులేటి..వారికి ధైర్యం చెప్పారు.హెలికాప్టర్లు పంపించేందుకు ప్రయత్నించారు..కానీవాతావరణ సహకరించకపోవడంతో సాధ్యం కాలేదు.. అయితే డ్రోన్ ద్వారా బాధితులకు సేఫ్టీ జాకెట్లు పంపించారు.
అయితే ఇంతలోనే వరద ఉధృతి పెరిగి ఇంటి గోడ కూలిపోయిందని మంత్రి పొంగులేటి మీడియాతో చెప్పారు.. లైఫ్ జాకెట్లు ఉన్నాయి.. వారు క్షేమంగా బయటికి రావాలని కోరుకుంటున్నానని కంటనీరు పెట్టుకున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.