ఖమ్మం-వరంగల్-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల

ఖమ్మం-వరంగల్-నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల అయ్యింది. ఏప్రిల్ 25వ తేదీ గురువారం కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఈ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసింది. 

షెడ్యూల్ ప్రకారం.. మే 2న ఉప ఎన్నికకేు నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మే 9వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు.  మే 10న నామినేషన్ల పరిశీలించనున్నారు. మే 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మే 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఇక, జూన్‌ 5న ఫలితాలను వెల్లడించనుందిఈసీ

ఏప్రిల్ 24వ తేదీ బుధవారం సాయంత్రం నల్గొండ– ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కాంగ్రెస్ తమ అభ్యర్థిని ప్రకటించింది.  ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జర్నలిస్టు తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. యూత్, గ్రాడ్యుయేట్లలో మంచి ఫాలోయింగ్ ఉన్నందున ఆయనకు టికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సీటు నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నికల అనివార్యమైంది.

Also Read:ఏపీ, తెలంగాణాలో ముగిసిన నామినేషన్ల పర్వం..