అన్నపురెడ్డిపల్లి, వెలుగు : కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అవకాశమిస్తే ఖమ్మం ఎంపీగా పోటీ చేస్తానని డిప్యూటీ సీఎం భట్టి సతీమణి మల్లు నందిని తెలిపారు. బుధవారం అన్నపురెడ్డిపల్లిలోని శివాలయం, బాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శివాలయ ఆవరణలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ ను ఇంటికి పంపినట్లే మోదీని కూడా గద్దె దించాలన్నారు. తెలంగాణలో ప్రతి పేదవాడికీ ఆరు గ్యారంటీ స్కీంలు అందేలా సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారని చెప్పారు. సమావేశంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కాంగ్రెస్ పానాయకులు గాంధీ, భీముడు, వెంకట్, అశ్వారావుపేట, మధిర, వైరా నియోజకవర్గాల కార్యకర్తలు పాల్గొన్నారు.
ఘనంగా సేవాదళ్ శతాబ్ది ఉత్సవాలు
చండ్రుగొండ, వెలుగు : కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ శతాబ్ది ఉత్సవాలను బుధవారం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక రైతువేదికలో అమ్మ ఫౌండేషన్ చైర్ పర్సన్ మల్లు నందిని కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, సేవాదళ్ రాష్ట్ర సెక్రటరీ దయాకర్ రావు, జిల్లా అధ్యక్షుడు నర్శింహారావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు దేవి ప్రసన్న, మండల అధ్యక్షుడు గోవిందరెడ్డి, నాయకులు సురేశ్, అన్వర్, కృష్ణవేణి, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.