ఖమ్మం, వెలుగు: వీపీఆర్ మిసెస్ఇండియా సీజన్–2 పోటీల్లో ఫస్ట్ రన్నరప్, మిసెస్ఇండియా ఫొటోజెనిక్గా ఖమ్మంకు చెందిన మహమ్మద్ ఫర్హా నిలిచింది. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన 912 మంది వివాహితలను ఆడిషన్ చేయగా 41 మంది ఫైనల్కు సెలక్ట్ అయ్యారు. వారిలో ఫర్హా ఒకరు. తెలంగాణ నుంచి ఈమె ఒక్కరే ఎంపిక కావడం విశేషం. ఆదివారం రాత్రి గుజరాత్లోని అహ్మదాబాద్లో ఫైనల్స్ జరగ్గా ఫర్హా ఫస్ట్ రన్నరప్గా, మిసెస్ఇండియా ఫొటోజెనిక్గా నిలిచింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తనకు ఫ్యామిలీ మెంబర్స్ సపోర్టుతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. మహిళల హక్కులు కాపాడేందుకు ఎప్పుడూ ముందుంటానని అన్నారు. ఈ ఈవెంట్లో అసైన్‍మెంట్స్, టాలెంట్, ట్రెడిషనల్, ఫైనల్ రౌండ్లు ఉంటాయని వివరించారు. ఎంబీఏ వరకు చదివిన ఫర్హా హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ మిషన్, ఉమెన్ ఎంపవర్మెంట్వింగ్కి ఖమ్మం సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
టీఆర్ఎస్ పాలనలో దళితులకు ద్రోహం
పెద్దసార్లు దిగరు.. కొలువులు రావు
అక్కడ రోడ్లపై చెత్త వేస్తే రూ. 5 వేలు ఫైన్
అప్పుడు పబ్.. ఇప్పుడు వైల్డ్‌లైఫ్ హాస్పిటల్