Dhee Dance Show: ఢీ షో డ్యాన్సర్ మోసం చేశాడంటూ.. సెల్ఫీ వీడియో తీసుకుని యువతి ఆత్మహత్య

Dhee Dance Show: ఢీ షో డ్యాన్సర్ మోసం చేశాడంటూ.. సెల్ఫీ వీడియో తీసుకుని యువతి ఆత్మహత్య

ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లో విషాదం చోటుచేసుకుంది. ఢీ షోలో డాన్సర్ అభి కారణం అంటూ కావ్యకళ్యాణి (24) అనే యువతి సూసైడ్ చేసుకుంది. తనని పెళ్ళి చేసుకొని తనతో కాపురం చేస్తూ ఇప్పుడు మరో యువతిని పెళ్ళి చేసుకుంటున్నట్లు కావ్యకళ్యాణి సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చింది.

'నేను చచ్చిపోబోతున్నాను.. నా చావుకి కారణం అభి.. 5 సంవత్సరాల నుంచి నన్ను ప్రేమించానని చెప్పి పెళ్ళి చేసుకొని ఇంటికి తీసుకెళ్లాడు.. ఇక ఇప్పుడు నన్ను వదిలేసి.. మరో అమ్మాయిని తీసుకొచ్చి.. నన్ను వెళ్లిపొమ్మన్నాడు..' అంటూ యువతి సెల్ఫీ వీడియో ద్వారా తెలిపింది.

అయితే, ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ప్రస్తుతం ఖమ్మం పోలీసులు నిందితుడు అభిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.