ఫుడ్​ ఐటెమ్స్ మధ్యలో ఎలుకల మలం.. లక్డీకాపూల్​లో ఫుడ్​సెఫ్టీ అధికారుల దాడులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలోని కొనసాగుతూనే ఉన్నాయి. లక్డీకాపూల్​లోని ఖాన్- ఎ -కాస్,  -షాహీ దస్తర్ ఖాన్, బడే మియాన్ కబాబ్స్​లో బుధవారం సాయంత్రం దాడులు చేశారు. ఖాన్- ఎ -ఖాస్ రెస్టారెంట్​ను  లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. కిచెన్​లో బొద్దింకలతోపాటు ఫుడ్​ఐటెమ్స్​ నిల్వ చేయడానికి ఉపయోగించే అల్మారాలపై ఎలుకల మలం ఉన్నట్లు తేల్చారు. 

అలాగే షాహి దస్తర్​ ఖాన్ ఫస్ట్ ఫ్లోర్​లోని  వంట గది ఆవరణలో బొద్దింకలు ఉన్నట్లు  గమనించడంతో పాటు ఎక్స్​పైరీ అయిన మ్యాంగో మసాలా, కొబ్బరి పాలు, కియోరా నీటిని వాడుతున్నట్లు నిర్ధారించారు. బడే మియాన్ కబాబ్స్​లో లేబుల్స్ లేని ఫుడ్ ఐటెమ్స్​, నిషేధిత సింథటిక్ కలర్లను వాడుతున్నట్లు గుర్తించారు. ఆయా రెస్టారెంట్లకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు గురువారం తెలిపారు.

Also Read:-టెన్త్​ ఎగ్జామ్​ 100 మార్కులకు.. ఇంటర్నల్ 20 మార్కులు ఎత్తివేత