బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం :భూక్య జాన్సన్ నాయక్

కడెం, వెలుగు: ఈ ఎన్నికల్లోనూ బీఆర్​ఎస్​అధికారంలోకి రావడం ఖాయమని ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి భూక్య జాన్సన్ నాయక్ ధీమా వ్యక్తం చేశారు. కడెం మండలం కన్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్న క్యాంప్, వకీల్ నగర్, గుండు గూడ గ్రామాలకు చెందిన 100 మంది యువకులు శనివారం బీఆర్ఎస్ లో చేరగా వారికి జాన్సన్​ నాయక్​ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు యువత  ఆకర్షితులై బీఅర్ఎస్​లో చేరుతున్నారని చెప్పారు. 

కేసీఆర్ ను హ్యాట్రిక్ సీఎంగా చేస్తే అణగారిన వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కడెం జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్, మాజీ ఎంపీపీ రాజేశ్వర్ గౌడ్, నాయకులు  జీవన్ రెడ్డి, బాదన్ కుర్తి సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఖానాపూర్ మండలం చింతలపేట, కడెం మండలం అంబర్ పేట గ్రామాల్లోని దుర్గామాత విగ్రహాల వద్ద జాన్సన్​ నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.